ఏపీ సచివాలయంలో ఎమర్జెన్సీ అలారం మోగింది..  - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ సచివాలయంలో ఎమర్జెన్సీ అలారం మోగింది.. 

November 21, 2017

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తాత్కాలిక సచివాలయంలో మంగళవారం కలకలం రేగింది. అక్కడ ఏర్పాటు చేసిన చేసిన ఎమర్జెన్సీ అలారం ఒక్కసారిగా మోగడంతో ఉద్యోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.  రెండో బ్లాక్‌లోని  అలారం మోగడంతో  అక్కడ పని చేస్తున్న ఉద్యోగులు ప్రాణభయంతో పరుగులు పెట్టారు.తర్వాత భద్రతా సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని ఎందువల్ల అలారం మోగిందో విచారించారు. పొగవల్ల అది మోగిందని పోలీసులు తెలిపారు. అలారం వద్ద ఎవరో సిగరెట్ తాగడంతో అది మోగిందని తేల్చారు. దీంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.