mictv telugu

నోట్ల రద్దుతో వెంకన్న హుండీకి గండి

January 6, 2018

నోట్ల రద్దు ప్రభావం దేవుళ్లపైనా పడింది. ప్రఖ్యాత హిందూ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం  2017లో హుండీ ఆదాయ వివరాలను వెల్లడించింది.  2016తో పోలిస్తే 2017ఆదాయం  తగ్గిందని తెలిపింది. మోదీ ప్రభుత్వం గత ఏడాది నోట్ల రద్దు చేసిన కారణంగా  ఆలయం ఆదాయం తగ్గినట్లు భావిస్తున్నారు.

2017లో దేవస్థానాానికి హుండీ ద్వారా రూ.  995.89 కోట్లు వచ్చాంయి. 2016లో  ఆదాయం రూ. 1046.28 కోట్లు వచ్చింది. దాంతో పోల్చితే దాదాపు రూ. 50 కోట్లు తక్కవగా నమైదైంది గత ఏడాది. కాగా 2017లో గుడికి 2.73 కోట్ల భక్తులు వచ్చారు. 1,87,00 కేజీల తలనీలాలను  సమర్పించారు. వాటిని అమ్మగా రూ. 6.39 కోట్లు ఆదాయం వచ్చింది.

ఆన్‌లైన్ డొనేషన్ల వివరాలనుకూడా  టీటీడీ ప్రకటించింది. 2016లో ఆన్‌లైన్ ఆదాయం రూ. 10.53 కోట్లు , 2017లో రూ. 15.36 కోట్లు వచ్చిందని టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఎస్విబీసీ ఛానల్  కార్యక్రమంలో ‘ డయల్ యువర్  ఈఓ’ ఆయన పాల్గొని ఈ విషయాలను వెల్లడించారు.