దేవుడి సొమ్ము తిని బలిసిన పందికొక్కు.. - MicTv.in - Telugu News
mictv telugu

దేవుడి సొమ్ము తిని బలిసిన పందికొక్కు..

December 12, 2017

ఏసీబీ వలలో మరో భారీ తిమిగలం చిక్కింది. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. మంగళవారం ఉదయం ఏకకాలంలొ  దాడులు చేపట్టారు. చంద్రశేఖర్ నివాసాలతో పాటుగా యనమల కుదురులోని ఆయన తమ్ముడు వివేకానంద ఇంటిలోను, బంధుమిత్రుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. రాజమహేంద్రవరం, విజయవాడ , ఏలూరు, నూజివీడు,హైదరాబాద్, ఆనంతపురం జిల్లా ఊబిచర్లలో తనిఖీలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 18 చోట్ల, 21 బృందాలతో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కోట్ల విలువైన ఆస్తులు, బంగారు నగలు, నగదు బయటపడ్డాయి. చంద్రశేఖర్ ఆజాద్ రాజమహేంద్రవరంలో విధులు నిర్వహిస్తున్నాడు.

చంద్రశేఖర్ ఆజాద్ ఏలూరు పత్తేబాద్‌ సమీపంలో బినామీ పేర్లతో 6 ఎకరాల విలువైన స్థలాన్ని కొనుగోలు చేసినట్లు తేలింది. అలలాగే విజయవాడ పడమట సమీపంలోని విద్యుత్‌ కాలనీలో కుటుంబ సభ్యుల పేరున కోట్ల రూపాయిల విలువ చేసే ఐదంతస్తుల భవనం, గొల్లపూడిలో కోటిన్నర రూపాయిలతో 500 గజాల స్దలంలో గృహ ప్రవేశానికి సిద్దంగా ఉన్న అత్యంత ఆధునిక సౌకర్యాలతో కూడిన నూతన భవనం ఉన్నట్లు బయటపడింది.