గిడ్డి ఈశ్వరిని బాబు  కొన్నది నిజమే.. షాకింగ్ వీడియో.. ! - MicTv.in - Telugu News
mictv telugu

గిడ్డి ఈశ్వరిని బాబు  కొన్నది నిజమే.. షాకింగ్ వీడియో.. !

November 29, 2017

తెలుగుదేశం పార్టీ అధినేత , ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష వైకాపా పార్టీ ఎమ్మేల్యేలను  ఎలా కొనుగోలు చేస్తారన్న  విషయం బట్టబయలైంది. వైకాపా నుంచి టీడీపీలోకి జంప్ అయిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరితో చంద్రబాబు కుదుర్చుకున్న భారీ డీల్  రట్టయింది.

 

టీడీపీలో చేరితే తనకు  మంత్రి పదవి లేదా ఎస్టీ కార్పొరేషన్ పదవి ఇస్తామనిచెప్పినట్టు ఆమె స్వయంగా తెలిపారు. ఈ మేరకు తన కార్యకర్తలతో ఆమె మాట్లాడుతున్న వీడియో  బయటికి పొక్కింది. చంద్రబాబు ఇచ్చిన ఆఫర్‌ను ఆమె తన అనుచరులకు వెల్లడించింది.

 ఆఫర్ బాగుందని, వెళ్లక తప్పదని చెప్పింది. ‘చంద్రబాబు  అంటే ఇష్టం లేదు.. కాని మనకు పదవి కావాలి’ అని పేర్కొంది. అన్ని పనుల్లో కమీషన్లు కూడా వస్తాయని ఆమె అన్నారు.ఈ విషయంపై వైకాపా  ఎమ్మెల్యే పుష్పవాణి  మండిపడ్డారు. గిడ్డి ఈశ్వరి‌ వీడియో చంద్రబాబు బండారం బయటపడిందని ఆమె అన్నారు.

ముఖ్యమంత్రి  పదవిలో ఉన్న వ్యక్తి ఇలా ఎమ్మెల్యేను ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకోవడం సిగ్గుచేటు అని ఆమె తీవ్రంగా మండిపడ్డారు. తమ పార్టీలో ఇన్నాళ్లుగా  ఏం చెప్పామో .. ఇప్పుడు ఈ వీడియోతో నిజమైందని తెలిపారు. సంతలో పశువులను కొన్నట్టు ఎమ్మెల్యేలను కొంటున్నారని గతంలో చంద్రబాబునే అన్నాడని, ఇప్పుడు ఆ పని ఆయన చేస్తున్నారని  విమర్శించారు.

జగన్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు పెడతా: ఈశ్వరి

వైకాపా అధినేత జగన్‌కు గిరిజనుల అభివృద్ధి గిట్టదని ఈశ్వరి అన్నారు. జగన్‌పై ఎస్సీ, ఎస్టీ కేసులు పెడతానని, సాక్షి పత్రిక, చానల్‌పై చట్టపరంగా ముందుకు వెళ్తానని హెచ్చరించారు. పార్టీ  కోసం మూడున్నరేళ్లు కష్టపడితే జగన్‌ తనకు మానసిక క్షోభ మిగిల్చారని అన్నారు. ‘గిరిజన మహిళనైన నాకు వ్యతిరేకంగా ఆయన కుట్రలు పన్నుతున్నారు..  జగన్‌ సీఎం కావడం కోసమే పార్టీ పెట్టారు.. గిరిజనుల అభివృద్ధికి చంద్రబాబు కృషి చేస్తున్నారు..’ అని అన్నారు.