మడతపెట్టే ఫోన్ల కోసం కంపెనీల పోటీ..!  

ప్రపంచంలో మెుట్టమెుదటి సారిగా మడతపెట్టే ఫోన్‌ను వచ్చే ఏడాది విడుదల చేయాలని స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ ప్లాన్ చేసింది. గెలాక్సీ ఎక్స్ పేరుతో 2018లో మార్కెట్ లోకి లాంచ్ చేయబోతుందట. శాంసంగ్ పోటీగా టెక్ దిగ్గజం ఆపిల్ కూడా మడతపెట్టే  ఫోన్లపై దృష్టిసారించింది. 2020 కల్లా ఆపిల్‌లో మడతపెట్టే ఐ ఫోన్ వస్తుందట.  ఎల్‌జీ డిస్‌ప్లేతో మడతపెట్టే ఐ‌ఫోన్‌ను రూపొందిండం ప్రారంభించిందని రిపోర్టులు పేర్కొన్నాయి. కొత్త ఐఫోన్ మోడల్‌కోసం మడత పెట్టే ఒలెడ్ స్క్రీన్‌ను, ఎల్‌జీ డిస్‌‌ప్లే ఇటీవల అభివృద్ది చేసిందని బెల్ సర్వే తెలిపింది..

SHARE