mictv telugu

కాంగ్రెస్‌ పార్టీలో హిజ్రాకు కీలక పదవి

January 8, 2019

మారుతున్న కాలానికి తగ్గట్టు రాజకీయ పార్టీలు కూడా అన్ని వర్గాలకు సముచిత స్థానం ఇస్తున్నాయి. ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్ చంద్రముఖి పోటీ చేయడం తెలిసిందే. దేశంలో పాలు చోట్ల హిజ్రాలు పోలీసులుగా, జడ్జీలుగా, మేయర్లుగా, జర్నలిస్టులుగా ఎన్నో రంగాల్లో రాణిస్తున్నారు. తాజా తాజాగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ ట్రాన్స్‌జెండర్‌కు పార్టీలో కీలక పదవిని అప్పగించాడు.

Telugu news, Apsara Reddy transgender woman appointed as the national general secretary of All India Mahila Congress by Rahul Gandhi

తమిళనాడుకు చెందిన, తెలుగు మూలాలు ఉన్న అప్సరా రెడ్డి అనే ట్రాన్స్ జెండర్‌ను ఆలిండియా మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ పదవి చేపట్టిన తొలి హిజ్రాగా రికార్డు సృష్టించింది. జర్నలిస్టుగా పనిచేస్తున్న అప్సర గతంలో అన్నాడీఎంకేలో, బీజేపీలో పనిచేసింది. ఉన్నత విద్యావంతురాలైన ఆమె లండన్ సిటీ వర్సిటీలో చదువుకుంది. బీబీసీ వరల్డ్ సర్వీస్, ద హిందూ, ఇండియన్ ఎక్స్ ప్రెస్, దక్కన్ క్రానికల్ తదితర మీడియా సంస్థల్లో పనిచేసింది.

Telugu news, Apsara Reddy transgender woman appointed as the national general secretary of All India Mahila Congress by Rahul Gandhi