వావ్.. వజ్రాల విమానం.. అందరి కళ్లూ దానిపైనే   - MicTv.in - Telugu News
mictv telugu

వావ్.. వజ్రాల విమానం.. అందరి కళ్లూ దానిపైనే  

December 7, 2018

అరబ్ దేశాలు ధనిక దేశాలని అందరికీ తెలుసు.. కోటాను కోట్లకు అధిపతులు, ఆకాశాన్నిఅంటే భవనాలు వాటి సొంతం. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)కి చెందిన ఎమిరేట్స్  విమానయాన సంస్థ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంతకు అదేంటో తెలుసా ? వజ్రాలతో మిలమిల మెరిసిపోయే విమానానికి సంబంధించిన ఓ ఫొటో.

అమ్మో వజ్రాల విమానమా? దాని ఖరీదెంతో? ఇంతకు అది ఎక్కడుంది? అందులో ప్రయాణించాలంటే ఎంత ధర అవుతుందోనని ఆలోచిస్తున్నారు కదా .. ఆగండాగండి అది నిజంగా వజ్రాల విమానం కాదు. కేవలం ఫోటో మాత్రమే. ఈ విషయాన్ని అరబ్ ఎమిరేట్స్ సంస్థనే ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

ఈ ఫోటోను పోస్ట్ చేసిన ఎమిరేట్స్ సంస్థ ‘బ్లింగ్’ 777 ఇమేజ్ క్రియేటెడ్ బై సారా షకీల్’ అంటూ ట్వీట్ చేసింది. ఇది కేవలం ఫోటో మాత్రమే. మొదట ఫోటోను చూసిన నెటిజన్లు నిజంగానే వజ్రాల విమానం అని భావించారు. ఆ తర్వాత పక్కనే ఉన్న క్యాప్షన్ ను చూసి కొంత నిరాశకు గురయ్యారు. ఈ చిత్రాన్ని ప్రముఖ క్రిస్టల్ ఆర్టిస్ట్ సారా షకీల్ ఈ అద్భుత చిత్రాన్ని రూపొందించి.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇది చూసిన ఎమిరేట్స్ సంస్త ఆమె అనుమతి తీసుకొని ఈ ఫొటోను రీపోస్టు చేశారు. ఈ విషయాన్ని సదరు అధికారి మీడియాకు వెల్లడించారు.

Telugu News Arab Emirates Post Diamonds Flight Photo In Twitter