ఎమ్మెల్యేను చంపింది వీరే - MicTv.in - Telugu News
mictv telugu

ఎమ్మెల్యేను చంపింది వీరే

September 24, 2018

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను చంపిన మావోయిస్టులను గుర్తించామని  పోలీసులు తెలిపారు.. స్థానికుల ద్వారా వివరాలు సేకరించిన సమాచారంతో ముగ్గురు నిందితుల పేర్లను సోమవారం వెల్లడించారు.

ఆదివారం విశాఖ మన్యంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మావోయిస్టులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ అయితే దాడికి పాల్పడింది అరుణ అలియాస్ వెంకటరవి చైతన్య, స్వరూప అలియాస్ కామేశ్వరి, జులుమూరి శ్రీనుబాబు అలియాస్ సునీల్ అని పోలీసులు తెలిపారు.

They killed the Araku MLA

ఎస్‌జెడ్‌సీఎం దళానికి చెందిన అరుణ స్వస్థలం విశాఖపట్నం జిల్లా కరకపాలెం కాగా.. స్వరూప భీమవరం, శ్రీనుబాబు దబ్బపాలెం మండలం అడ్డతీగల వాసిగా పోలీసులు గుర్తించారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యలతో అప్రమత్తమైన ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ విశాఖ అడవిలో మావోయిస్టుల కోసం ప్రత్యేక బలగాలతో గాలిస్తున్నారు.