తెలుగమ్మాయిలు హీరోయిన్లుగా పనికిరారు..మరి హీరోలెలా పనికొస్తారు ? సంధ్య - MicTv.in - Telugu News
mictv telugu

తెలుగమ్మాయిలు హీరోయిన్లుగా పనికిరారు..మరి హీరోలెలా పనికొస్తారు ? సంధ్య

April 19, 2018

తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా పనికిరారని చెప్తున్నారు సరే.. మరి హీరోలు ఎలా పనికి వస్తారని ప్రశ్నించారు సామాజిక కార్యకర్త సంధ్య. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ‘ ఎన్నో సర్జరీలు చేసుకుని హీరోలు అవుతున్నారు. హీరోయిన్లను ఎక్కడెక్కడి నుంచో తెస్తున్నారు. మరి హీరోలను కూడా తేవచ్చు కదా. ఇతర భాషా హీరోలను కూడా ఇక్కడ ప్రోత్సహించవచ్చు కదా ? అమ్మాయిల విషయంలో కొత్త ముఖాలు అవీ నార్త్ ముఖాలు కావాలి.. కానీ అబ్బాయిల విషయంలో కొత్త ముఖాలు, ఇతర భాషా హీరోలు అవసరం లేదా ?అలా చెయ్యరు.. ఎందుకంటే ఓ నాలుగైదు కుటుంబాల వాళ్ళే ఇక్కడ హీరోలుగా వుండాలని గిరి గీసుకున్నారు కాబట్టి. ఇతర భాషా హీరోల సినిమాలనే ఇక్కడ ఆడనివ్వరు. అలాంటిది వేరే కుర్రాళ్ళను ఇక్కడ హీరోలుగా ఎలా రానిస్తారు ? ’ అని పేర్కొన్నారు సంధ్య.  థియేటర్ మాఫియా ఇక్కడ వేన్నూళ్ళుకు పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. టాలీవుడ్‌లో పురుషాధిక్యత బాగా వుందని తెలిపారు.