4జీ ఫోన్ రూ.1,399కే

రిలయన్స్ జియోకు పోటీగా ఎయిర్‌టెల్ తన కొత్త 4జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధర రూ. 1,399. హ్యాండ్‌సెట్ తయారీదారైన కార్బన్ మెుబైల్స్ భాగస్వామ్యంతో అందిస్తున్నట్టు బుదవారం వెల్లడించింది. 4జీ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్ ఫోన్ ధర ఒకేలా తన స్మార్ట్‌ఫోన్‌ను ఎయిర్‌టెల్ రంగంలోకి దింపింది. జియో మాదిరిగానే క్యాష్ రీఫండ్ ఆఫర్‌ను ఎయిర్‌టెల్ ప్రకటించింది. ఆండ్రాయిడ్ ఆధారితంగా వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఫుల్ టచ్ స్క్రీన్, డ్యుయల్ సిమ్ స్లాట్లు, యూట్యూబ్, వాట్సాప్,ఫేస్‌బుక్ వంటి పాపులర్ యాప్స్ ఉన్నాయి. వినియోగదారులు రూ. 2,899తో డౌన్‌పేమెంట్ చేయాలి. 36 నెలల పాటు నెలవారీ రూ.169తో రీచార్జ్ చేసుకోవాలి. 18 నెలల ఆనంతరం 500 క్యాష్ రీఫండ్ చేస్తారు. 36 నెలల తర్వాత మరో రూ.1000 వెనక్కి ఇస్తారు. ఇలా మెుత్తంగా రూ.1500 రీఫండ్  పొందవచ్చు. రీచార్జ్ మెుత్తాలను కలుపుకుంటే మెుత్తం కార్బన్ ఏ 40 భారత్‌లో ధీని ధర 3,499. ఈ స్మార్ట్‌ఫోన్లు పరిమిత సంఖ్యలో మాత్రమే స్టాక్స్ అందుబాటులో ఉన్నాయని, దగ్గరల్లోని కార్బన్ రిటైల్ స్టోర్‌లో విటిని పొందవచ్చని ఎయిర్‌టెల్ తెలిపింది.

SHARE