శ్రీదేవిని అర్జున్ కపూర్ వేధించేవాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీదేవిని అర్జున్ కపూర్ వేధించేవాడు..

February 27, 2018

నటి శ్రీదేవి చనిపోయాక అనేక కథనాలు, అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీదేవి బాబాయి ఎం. వేణుగోపాల్ కొన్ని విషయాలను వెల్లడించారు. బోనీకపూర్ శ్రీదేవిని పెళ్లి చేసుకోవడం ఆయన మొదటి భార్య కొడుకు, హీరో అర్జున్ కపూర్‌కు అస్సలు ఇష్టం లేదని తెలిపారు. తనను చాలాసార్లు అర్జున్ ఇబ్బంది పెడుతున్నట్టు శ్రీదేవి చెప్పుకొని బాధ పడేదని వేణుగోపాల్ తెలిపారు. శ్రీదేవి మరణవార్త తెలిసిన వెంటనే వేణుగోపాల్ భార్య, కొందరు బంధువులు ముంబైలోని శ్రీదేవి ఇంటికి వెళ్లారు. అక్కడ కాసేపు ఉన్న తర్వాత హోటల్‌లో రూము తీసుకుని ఉన్నట్టు చెప్పిన వేణుగోపాల్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
‘ శ్రీదేవి మనస్తత్వం చాలా సున్నితమైంది. ఆమె కావాలని ఎవ్వర్నీ బాధ పెట్టేది కాదు. కానీ ఆమె ఎప్పుడైతే బోనీ కపేర్‌ను పెళ్లి చేసుకుందో అప్పటినుంచే ఆమెకు సమస్యలు మొదలయ్యాయి. ముఖ్యంగా సవతి కొడుకైన అర్జున్ కపూర్ శ్రీదేవి నాకెప్పటికీ తల్లి కాలేదని అప్పట్లోనే బాహటంగానే చెప్పాడు. తన తల్లి మరణానికి శ్రీదేవియే కారణమని, శ్రీదేవి రాకతోని పచ్చని మా కుటుంబంలో కళతలు, విషాదాలు చెలరేగాయని అర్జున్ శ్రీదేవి ముఖం పట్టుకొనే చెప్పేవాడని చెప్పుకొని చాలా బాధ పడేది. ఓసారి బోనీకి షుగర్ బాగా పెరిగిపోతే శ్రీదేవి చాలా ఆందోళనకు గురైంది, తనూ, పిల్లలు ఏమైపోతామోనని బాధపడింది ’ అని అన్నారు.

చెల్లెలు శ్రీలతతో ఆమెకు ఉన్నవి ఆస్తి తగాదాలు కావని పేర్కొన్నారు. తల్లి రాజేశ్వరికి ఓ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో ఒకచోట చెయ్యాల్సిన ఆపరేషన్ మరోచోట చేయటంతో ఆమె చనిపోయింది. అప్పుడు ఆసుపత్రిపై కేసు పెట్టింది. ఆ తర్వాత డబ్బుల విషయంలో ఇద్దరికీ మనస్పర్థలు వచ్చాయి తప్పితే అంతకుమించి మరేమీ లేదని తేల్చి చెప్పారు. శ్రీదేవికి చికెన్, మటన్ అంటే చాలా ఇష్టమని, ముక్కుకు ఆపరేషన్ అయ్యాక తిండి బాగా తగ్గించిందని తెలిపారు.
శ్రీదేవి ఎంత పెద్ద స్టార్‌గా ఎదిగినా బంధువులతో మాత్రం చక్కగా ఉండేదని, మద్రాస్ వెళ్లినా తమతో టచ్‌లోనే ఉండేదని వివరించారు. ఇంటికి తమ వాళ్లు ఎవరు వచ్చినా అంతో ఇంతో ఇచ్చి పంపిస్తుండేదని, తన ఇద్దరు కూతుళ్ళ గురించి ఈ మధ్య  చాలా దిగులు పెట్టుకొని పదే పదే బాధపడేదని వేణుగోపాల్ గుర్తు చేసుకున్నారు.