‘అర్జున్ రెడ్డి’ గ్రేట్... - MicTv.in - Telugu News
mictv telugu

‘అర్జున్ రెడ్డి’ గ్రేట్…

September 2, 2017

‘అర్జున్ రెడ్డి’ని ప్రశంసల జల్లులు  ముంచెత్తుతున్నాయి. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా విజయ్ దేవరకొండను పొడిగేశాడు. ‘ఈ సినిమాను డైరెక్టర్ సందీప్ వంగా సాధారణంగా కాకుండా సరికొత్తగా, సామసోపేతంగా, సహజంగా తెరకెక్కించారు. సందీప్ కు ఇది మెుదటి చిత్రమే అయినా అనుభవమున్న దర్శకుడిగా తీశారు.. ’ అని మహేశ్ కొనియాడాడు.

విజయ్ దేవరకొండ నటన అద్భుతమని, హీరోయన్ శాలిని, అమె ఫ్రెండ్స్ పాత్రలు బ్రిలియంట్ గా ఉన్నాయని పేర్కొన్నాడు. అర్జున్ రెడ్డి చిత్రం రికార్డులు తిరగరాస్తుందని, ఈ  మూవీ టీంలోని వారదరికీ అభినందనలు తెలుపుతున్నానని చెప్పారు. ఇక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూాడా అర్జున్ రెడ్డికి కితాబునిచ్చింది.  ఎంతో కొత్తగా, విశిష్టంగా తీశారని , విజయ్ దేవరకొండ నటన ఆకట్టుకునేలా ఉందని ప్రశంసించింది. అర్జున్ రెడ్డి  చాలా నేచురల్ గా తీసారని టీం అందరికి కంగ్రాగ్స్ చెప్పింది. ప్రస్తుతం మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ స్పైడర్ మూవీలో నటిస్తున్నారు.