అర్జున్ రెడ్డి కలెక్షన్లు అదుర్స్... - MicTv.in - Telugu News
mictv telugu

అర్జున్ రెడ్డి కలెక్షన్లు అదుర్స్…

August 30, 2017

విజయ్ దేవరకొండ, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వచ్చిన ‘అర్జున్ రెడ్డి ‘ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ కలెక్షన్ల తో దూసుకెళ్తున్నది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లను రాబడుతున్నట్టు సినీ విశ్లేషకులు వెల్లడించారు.

అర్జున్ రెడ్డి ఈ నెల 25న విడుదలై ప్రేక్షకులను విశేంగా ఆకర్షించడమే కాక , నాలుగు రోజుల్లో అమెరికాలో మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిందని మూవీ ట్రాకర్ రమేష్ బాలా ట్విటర్ ద్వారా తెలిపారు. అర్జున్ రెడ్డి మూవీ విడుదలైన 4 రోజుల్లో దేశవ్యాప్తంగా రూ. 27.6 కోట్లు,  ప్రపంచ వ్యాప్తంగా రూ. 47.34 కోట్లను వసూల్ చేసినట్లు తాజా సమాచారం.

అర్జున్ రెడ్డి మూవీ అద్భతమైన కథాంశంతో తెరకెక్కెంచారు. ఈ మూవీ చూసేందుకు ఎక్సైటింగ్ వెయిట్  చేస్తున్నా అర్జున్ రెడ్డిని ఇంగ్లీష్  సబ్ టైటిల్ తో ముంబైలో రిలీజ్ చేస్తారా.!” అని ప్రముఖ సినీ విశ్లేకుడు తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.ఈ మూవీలో విజయ్ దేవరకొండ, శాలిని పాండే జోడిగా నటించారు.