‘అర్జున్ రెడ్డి’కి అమెరికాలో 8 కోట్లు - MicTv.in - Telugu News
mictv telugu

‘అర్జున్ రెడ్డి’కి అమెరికాలో 8 కోట్లు

September 4, 2017

అర్జున్ రెడ్డి సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లోనూ.. ముఖ్యంగా అమెరికాలో హల్ చల్ చేస్తోంది. అగ్రరాజ్యంలో ఈ సినిమా ఇప్పటివరకు రూ. 8 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిందని సినీ పండితులు తరణ్ ఆదర్శ్ ట్విటర్ లో తెలిపారు. ఈ సినిమా రెండో వారం వసూళ్లు రూ. 8.87 కోట్లని వెల్లడించారు. రెండోవారంలో శుక్రవారం రూ. 56 లక్షలు, శనివారం రూ. 73 లక్షలు రాబట్టిందని పేరొకన్నారు. అర్జున్ రెడ్డి భారత్ లో, విదేశాల్లో సాధించిన కలెక్షన్లు రూ. 100 కోట్లు దాటుతాయని అంచనా. ఇందులో ఇప్పటికే సగానికిపైగా వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. అర్జున్ రెడ్డి మూవీకి మరో 10 నిమిషాల నిడివిగల సీన్లను కలిపి ప్రదర్శించాలని నిర్ణయించిన నేపథ్యంలో కలెక్షన్లు మరింత పెరిగే చాన్సుంది. అర్జున్ రెడ్డి మలేసియా, గల్ఫ్ తదితర దేశాల్లోనూ దూసుకెళ్తోంది.

అర్జున్ రెడ్డి భారత్ లో, విదేశాల్లో సాధించిన కలెక్షన్లు రూ. 100 కోట్లు దాటుతాయని అంచనా. ఇందులో ఇప్పటికే సగానికిపైగా వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. అర్జున్ రెడ్డి మూవీకి మరో 10 నిమిషాల నిడివిగల సీన్లను కలిపి ప్రదర్శించాలని నిర్ణయించిన నేపథ్యంలో కలెక్షన్లు మరింత పెరిగే చాన్సుంది. అర్జున్ రెడ్డి మలేసియా, గల్ఫ్ తదితర దేశాల్లోనూ దూసుకెళ్తోంది.