విజయ్ అలా మాట్లాడ్డం తప్పు - MicTv.in - Telugu News
mictv telugu

విజయ్ అలా మాట్లాడ్డం తప్పు

August 31, 2017

’అర్జున్ రెడ్డి’ పై మరో వివాదం చెలరేగింది. ఈసారి నటి, ప్రముఖ టీవీ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఫైర్ అయ్యారు.

ఈ సినిమా టీజర్ లో హీరో… మహిళల గురించి  తప్పుగా మాట్లాడిన డైలాగ్ పై ఆమె విరుచుకుపడ్డారు. అయితే ఈ డైలాగ్ ను సెన్సార్ బోర్డు కత్తించింది. అయినా అనసూయ భగ్గుమంది. ‘ఈ సినిమా ఫస్ట్ లుక్ చూసి చాలా బాగుంది అనుకున్నా.  ఈ మూవీని చూడాలని ఎప్పటి నుంచో ఎదురుచుస్తున్నా. కానీ , చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను ఏలా నిర్వహించిందో చూడండి. నేను చూడలేదు , చూసే దైర్యం కూడా చేయలేదు. ఓ తల్లి గురించి అలా మాట్లాడటం చాలా తప్పు. ఏదేమైనా ఈ విషయం గురించి నేను ఇంకేమీ మాట్లాడదలుచుకోలేదు.  ఏది సరైనదో ఏది మనకు తెలిస్తే చాలు’ అని ట్వీట్ చేసింది.  అనసూయ ట్వీట్లపై కొందరు నెటిజన్లు సానుకులంగా స్పందించగా, కొందరు అమె కామెంట్లపై మండిపడుతూ విజయ్ దేవరకొండ అలియాస్ అర్జున్ రెడ్డిని పొడిగేశారు.