చిన్నారి పాటకు విజయ్ ఫిదా 


విజయ్ దేవరకొండ కథానాయకుడుగా నటించిన ‘ అర్జున్ రెడ్డి’ చిత్రం ఎంత హల్‌చల్ చేసిందో మనందరికీ తెలుసు.. ఈ చిత్రం‌లో విజయ్ నటనకు  పిల్లలు కూడా ఫిదా అయ్యారు. ఈ చిత్రంలోని ‘ఏమిటేమిటో..’ పాటను ఓ చిన్నారి కారులో కూర్చుని ముద్దుగా,  చక్కగా  పాడుతున్న వీడియాను విజయ్  ట్విటర్‌లో ఫోస్టు చేశాడు. కారులో పెట్టిన పాటకు  ఆ చిన్నారి పాట పాడుతున్న విధానం విజయ్‌కి చాలా నచ్చిందట. విజయ్ ఈ వీడియోను ఫోస్టు చేస్తూ… ‘ క్యూటీ నిన్ను చూసి ప్రేమగా హత్తుకునే రోజు కోసం ఎదురుచూస్తున్నాన’ని ట్వీట్ చేశాడు.. ప్రస్తుతం విజయ్ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మాతగా  వ్యహరిస్తున్న ఓ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమాకు పరశురాం  దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక నటిస్తోంది. విజయ్‘ మహానటీ’ లో కీలక పాత్రలో నటిస్తున్నారు.

SHARE