త్వరలో ‘అర్జున్ రెడ్డి’ సీక్వెల్! - MicTv.in - Telugu News
mictv telugu

త్వరలో ‘అర్జున్ రెడ్డి’ సీక్వెల్!

April 23, 2018

‘అర్జున్ రెడ్డి’ తెలుగు సినీ చరిత్రలో కొత్త  చరిత్రను సృష్టించింది. ఈ చిత్రం యూత్‌ను విశేషంగా ఆకట్టుకుని,రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్  రాబోతుందని సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని గురించి విజయ్ దేవరకొండ దగ్గర ప్రస్తావించగా ఆయన స్పందించాడు.‘‘ అర్జున్ రెడ్డి’ సినిమా సీక్వెల్ గురించి సందీప్ రెడ్డి వంగా నాతో మాట్లాడాడు. 40 ఏళ్లు వచ్చిన తర్వాత ‘ అర్జున్ రెడ్డి’ వ్యవహారశైలి ఎలా ఉంటుందనే విషయం చెబితే బాగుటుందని నా అభిప్రాయం ’ అన్నాడు. ప్రస్తుతం సందీప్ ఒకవైపు చరణ్, మరోవైపు మహేశ్ బాబుతో సినిమాలు తీయాడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.‘అర్జున్ రెడ్డి’ సీక్వెల్  ఎప్పుడు సైట్స్ పైకి తీసుకెళ్తాడో మరీ చూడాలి.