తమిళ ‘అర్జున్ రెడ్డి’ తయార్ - MicTv.in - Telugu News
mictv telugu

తమిళ ‘అర్జున్ రెడ్డి’ తయార్

October 31, 2017

అర్జున్ రెడ్డి’ సినిమా తెలుగులో ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని తమిళంలో   విక్రమ్ తనయుడు ధ్రువ్ కథానాయకుడిగా  నటిస్తున్నాడు. ఈ చిత్రానికి బాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి  సంబంధించిన నిర్మాణ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి.  

తెలుగులో విజయ్ దేవరకొండ  ‘అర్జున్ రెడ్డి’ పాత్ర కోసం, తనను తాను చాలా మార్చుకున్నాడు. మరి తమిళంలో ధ్రువ్ ఎలా చేస్తాడన్నది అందరిలోని ఆసక్తిని రేపుతోంది. తన అక్క అక్షిత వివాహం సందర్బంగా ధ్రువ్ చాలా రోజుల తరువాత బయటికి వచ్చాడు. గడ్డం, పొడవాటి జుట్టుతో అచ్చం ‘అర్జున్ రెడ్డి’ స్టైల్ లోనే  ఉన్నాడు.

 విక్రమ్ కూడా ఏదైనా సినిమాకి ఓకే చెప్పితే, ఆ పాత్ర కోసం ఎంతగా శ్రమిస్తాడనేది అందరికి తెలుసు. మరి తండ్రి బాటలోనే  తానూ నడుస్తూ, ధ్రువ్ కూడా  కష్టపడి  మంచి గుర్తింపు తెచ్చుకుంటాడో లేదో  సూడాలె మరి.