ఆంధ్రప్రదేశ్ లోనూ ‘అర్జున్ రెడ్డి’పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమాను వెంటనే నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య గౌరవ అధ్యక్షురాలు మద్ది మాణిక్యం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కొరారు. అర్జున్ రెడ్డి మూవీ మహిళలను , విధ్యార్థులను కించపరిచేలా ఉందని, వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు.
ఆదివారం అర్జున్ రెడ్డి ప్రదర్శిస్తున్న శృంగవరపు కోట వెంకటేశ్వర డీలక్స్ థియేటర్ వద్ద మహిళ సంఘాలు ఆందోళన చేశాయి. అర్జున్ రెడ్డి మూవీ డైరెక్టర్ కు, హీరోకు మహిళలంటే గౌరవం లేదన్నారు. సినిమాలో అశ్లీల దృశ్యాలు ఉన్నాయని, మహిళలు తలదించుకునేలా ఉన్నాయని తెలిపారు. ఇలాంటి సినిమాలతో యువత పెడదారి పట్టే అవకాశం ఉందని మండిపడ్డారు. ఇప్పటీకే ఆడవాళ్లపైన ఆత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపొతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.