ఒవైసీకి ఆర్మీ దీటైన జవాబు.. అమరులకు మతం రంగా? - MicTv.in - Telugu News
mictv telugu

ఒవైసీకి ఆర్మీ దీటైన జవాబు.. అమరులకు మతం రంగా?

February 15, 2018

‘ముస్లింల జాతీయతను సోకాల్డ్‌ జాతీయవాదులు పదేపదే ప్రశ్నిస్తుంటారు. సంజువాన్‌ ఉగ్రదాడిలో వీరమరణం పొందిన ఏడుగురు అమర జవానులలో ఐదుగురు ముస్లింలు ఉన్నారు. దేశం పట్ల మాకున్న చిత్తశుద్ధి, ప్రేమను ప్రశ్నించేవారందరికీ ఈ ఉదంతం కనువిప్పు కావాలి. దేశం కోసం ముస్లింలు ప్రాణత్యాగాలు చేస్తున్నా పాకిస్తానీయులు అంటూ ముద్ర వేస్తున్నారు. దేశం పట్ల విధేయతను రుజువు చేసుకోవాలని ఇప్పటికీ ముస్లింలను అడుగుతున్నారు ’ అని ఎంఐఎం చీఫ్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కాగా ఒవైసీ వ్యాఖ్యలకు భారత సైన్యం దీటైన సమాధానం చెప్పింది.సైన్య  ఉత్తర విభాగం లెఫ్టినెంట్‌ జనరల్‌ దేవరాజ్‌ అన్భు బుధవారం మీడియాతో మాట్లాడుతూ…          ‘సైన్యాన్ని మేమెప్పుడూ మత కోణంలో చూడలేదు. మేము సర్వధర్మ స్థల్ సూత్రాన్ని అవలంబిస్తాం. కానీ కొందరు నేతలు మాత్రం అమర వీరులకు మతరంగును పులిమి రాజకీయ లబ్ది పొందటానికి ప్రయత్నిస్తున్నారు. భారత సైనికులకు మతం వుండదనే విషయం బహుశా వారికి తెలియకపోవచ్చు. మేమిక్కడ సరిహద్దుల్లో అందరూ సమానమని, మా ప్రాణాలకు తెగించి  పహారా కాస్తున్నాం. కానీ దేశంలో కొందరు రాజకీయ నాయకులు మతాలను అడ్డు పెట్టుకొని ప్రజల మధ్య లేని వైషమ్యాలను లేవనెత్తుతున్నారు. ఇది చాలా దారుణం. వారి దేశభక్తిని వారి విజ్ఞతతకే వదిలేస్తున్నాం ’ అని ఆయన పరోక్షంగా ఒవైసీకి చురకల అంటించారు.