సాయుధ బలగాల్లో 1,223 పోస్టులు - MicTv.in - Telugu News
mictv telugu

సాయుధ బలగాల్లో 1,223 పోస్టులు

March 5, 2018

కేంద్ర సాయిధ దళాల్లో ఖాళీల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్) విభాగాల్లో సబ్-‌ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) పోస్టులను; సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ (సీఐఎస్‌ఎఫ్) విభాగంలో అసిస్టెంట్ సబ్-‌ఇన్‌స్పెక్టర్ (ఏఎస్ఐ) పోస్టులను భర్తీ చేస్తారు. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్షతో రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.ఖాళీల వివరాలు…

-దిల్లీ పోలీస్‌ (ఎస్ఐ): 150 పోస్టులు

-సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌ (ఎస్ఐ): 1073 పోస్టులు

-సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ విభాగంలోని పోస్టుల వివరాలను తర్వాత ప్రకటిస్తారు.