ఇద్దరమ్మాయిల పెళ్లి.. పెద్దలను ఎదురించి..

 ఇద్దరు కలిసి చదువుకున్నారు. కలిసి పెరిగారు. ఇద్దరికీ ఒకేచోట ఉద్యోగాలు రావడంతో వేరే వూళ్ళో ఒకే రూంలో కలిసి వున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా ఇష్టం పెరిగింది. అదికాస్తా ప్రేమకు దారితీసింది. పెళ్లికి వారి పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో కోర్టును ఆశ్రయించి ఒక్కటయ్యారు. ఇంతకీ వాళ్లిద్దరు ఆడ, మగ కాదు. ఇద్దరూ అమ్మాయిలే. వాళ్ళల్లో ఒకరు భార్య అయ్యారు, ఒకరు భర్త అయ్యారు. ఈ ఘటన ఒడిశాలోని కేంద్రపడ పట్టణంలో చోటుచేసుకుంది. స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీంకోర్టు గతేడాది వెలువరించిన తీర్పు ఈ ఇద్దరు యువతులకు కలిసొచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. పట్టాముండి, మహాకాలపడ గ్రామాలకు చెందిన ఇద్దరు యువతులు సావిత్రి, మోనాలిసాలు కటక్‌లో చదువుకునే సమయంలో కలిసి వసతిగృహంలో ఉండేవారు. ఈ క్రమంలో ఇద్దరిమధ్యా ఇష్టం పెరిగింది. అది ప్రేమగా మారింది. ఉద్యోగాలు కూడా ఒకేచోట లభించడంతో వారిమధ్య బంధం మరింత బలోపేతం అయింది.

Telugu news Article 377 Abrogation Two Girls Marry Each Other In Kendrapara .

ఉద్యోగం చేస్తూ ఒకే అద్దె ఇంట్లో ఉండసాగారు. ఈ క్రమంలో ఒకర్ని విడిచి ఒకరు ఉండలేనంత గాఢంగా ప్రేమించుకోసాగారు. దీంతో ఇద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

కానీ ఇరు కుటుంబాల పెద్దవాళ్లు వీరి పెళ్లికి ససేమిరా ఒప్పుకోలేదు. ఇద్దరు అమ్మాయిలకు పెళ్లేంటని వాళ్ళు వేరే సంబంధాలు చూడసాగారు. దీంతో వీరిద్దరూ కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసి వివాహం చేసుకున్నారు. వీరిలోనే ఒకరు భర్తగా, మరొకరు భార్యగా వివరిస్తూ అఫిడవిట్‌ను నోటరీలో రిజిస్ట్రేషన్‌ చేయించారు. తమ మిగిలిన జీవితం కలిసి కొనసాగిస్తామని.. భవిష్యత్తులో ఎటువంటి గొడవలు జరిగినా వాటిపై ఫిర్యాదు చేయబోమని వారు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ పెళ్లి తన కూతురికి ఇష్టంలేదని, మరో యువతి బలవంతంతోనే తన కూతురు ఈ పెళ్లికి అంగీకరించిందని ఓ యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Telugu news Article 377 Abrogation: Two Girls Marry Each Other In Kendrapara