ఆర్య స్వయంవరం...70వేల మంది దరఖాస్తు! - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్య స్వయంవరం…70వేల మంది దరఖాస్తు!

February 20, 2018

‘వరుడు’ సినిమాలో  విలన్‌గా చేసిన తమిళ హీరో ఇప్పుడు వధువు కోసం చూస్తున్నాడు. దానికి సంబంధించి తన ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ కూడా పెట్టాడు. ‘నాకు పెళ్లి విషయంలో ఎలాంటి డిమాండ్స్, కండీషన్స్ లేవు. నేను మీకు నచ్చితే ,మీకు తగిన జోడీ అవుతానని  అనిపిస్తే  నానంబర్ 7330173301 కి కాల్ చేయండి’ అని ఓ వీడియోను పోస్ట్ చేశాడు.

కానీ ఇది నిజం పెళ్లికి కాదండోయ్.  ‘వయాకామ్18’ అనే సంస్థ ఓ చానల్‌లో నిర్వహించబోయే ‘ఇంగవీట్లు మాపిళ్లె’ అనే  స్వయంవరం ప్రోగ్రాంకు. అందులో  ఆర్య పెళ్లి కొడుకుగా పాల్గొంటున్నాడు.  ఇక ఆర్య పోస్ట్ చూడగానే దాదాపు 70 వేల మంది అమ్మాయిలు దరఖాస్తు చేస్తుకున్నారు.  చానల్ నిర్వాహకులు ఆ డెబ్బై వేల మంది అమ్మాయిలలో 18 మందిని ఎంపిక చేశారు. ఇంకో రెండు నెలల్లో ప్రసారం కాబోయే ఈ షోలో ఆర్య 18 అమ్మాయిలతో స్వయంవరం ఉంటుందట.