కుక్కపిల్ల అని పెంచితే ఎలుగుబంటి అయ్యింది! - MicTv.in - Telugu News
mictv telugu

కుక్కపిల్ల అని పెంచితే ఎలుగుబంటి అయ్యింది!

March 16, 2018

నల్లగా, ముద్దుగా, బొద్దుగా వుందని ఓ కుక్కపిల్లను తెచ్చుకున్నాడో వ్యక్తి. దాన్ని చాలా అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. కానీ అది పెద్దయ్యాక ఎలుగుబంటి అయింది. ఆశ్చర్యకర ఈ ఘటన చైనాలో జరిగింది. యునాన్ రాష్ట్రం యాంగ్ షెంగ్ కౌంటీకి చెందిన యాంగ్ అనే వ్యక్తి వ్యాహ్యాళికి వెళ్ళినప్పుడు కొండప్రాంతంలో దిక్కూమొక్కూ లేని స్థితిలో ‘కుక్క పిల్ల’ కనిపించింది. నల్లగా, కుక్క మూతితో ఉండడంతో కుక్కే అనుకున్నాడు. ఇంటికి తెచ్చి  దానికి పాలు, బువ్వు పెట్టి పెంచాడు.దానితోపాటు ఓ తెల్లకుక్క పిల్లనూ పెంచాడు. అవి రెండు చక్కగా ఆడుకునేవి. ఆ సీన్లను యాంగ్ వీడియోలు కూడా తీశాడు అయితే  ఎనిమిది నెలల్లోనే ‘కుక్కపిల్ల’ 1.7 మీటర్లు ఎత్తు పెరిగి, 80 కేజీల బరువు తూగింది. రూపం మారిపోయింది. ప్రవర్తనతో తేడాలొచ్చాయి. అయితే అది ఎవర్నీ గాయపరిచేది కాదు.  అది కుక్క కాదని, ఎలుగుబంటి అని యాంగ్ నిర్ధారణకు వచ్చాడు. ఎలుగును పెంచడం చట్టవిరుద్ధం కనుక దాన్ని గొలుసులతో కట్టేసి దాచాడు. తర్వాత బోనులో పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఎలుగు కాపాడి, జూకు పట్టుకుపోయారు.