మనదేశంలో బీరువీరులు తక్కువే అంట - MicTv.in - Telugu News
mictv telugu

మనదేశంలో బీరువీరులు తక్కువే అంట

March 24, 2018

మందుబాబులం.. మేం మందుబాబులం.. మందు కొడితే మాకు మేమె మహారాజులం.’ అని మందు కొట్టి మత్తుగా పడుకుంటారు. మందుల్లో పలురకాలు.. హాట్, కూల్ అని. మన దేశంలో బీరులు లాగించి పారేస్తారని అనుకుంటాం. ముఖ్యంగా వేసవిలో కూల్ కూల్‌కు డిమాండ్ ఎక్కువ. అయితే  మన దేశంలో బీరుబాబులు తక్కువేనని బీఎంఐ రీసెర్చ్ గ్రూస్ సర్వే తెలిపింది. ఆసియా ఖండంలోని మిగతా అన్ని దేశాలతో పొలిస్తే భారత్‌లో బీరు తక్కువగా తాగుతున్నారు. ఆసియాలో బీరు తలసరి వినియోగం 20. 9 లీటర్లు కాగా, భారత్‌లో 5.1 లీటర్లే అంట.

మనదేశంలో ఇంకా సంప్రదాయ మందు పద్ధతులు ఉండటం, బీరు లైసెన్సింగ్ నిబంధనలు,పెరిగిన ధర వల్ల  బీరువాడకం తక్కువని నివేదిక తెలిపింది. మారుతున్న జీవనశైలి, పెరిగిన ఆదాయాలు, పాశ్చాత్య జీవనశైలులను అనుసరించడం వల్ల దేశంలో 2022 వరకు బీరు అమ్మకాల సగటు 6.9 శాతానికి పెరిగే అవకాశముందని ఫిచ్ గ్రూప్ కంపెనీ తన నివేదికలో వెల్లడించింది. కారణాలేవైనా రాబోయే నాలుగేళ్లలో బీరు తాగేవారి సంఖ్య పెరుగుతుందనడం ఆందోళనకు గురిచేస్తోంది.