షోయబ్ బావను ఆటపట్టించిన భారతీయులు..   - MicTv.in - Telugu News
mictv telugu

షోయబ్ బావను ఆటపట్టించిన భారతీయులు..  

September 24, 2018

బావను ఆటపట్టించడంలో భలే మజా ఉంటుంది. ముఖ్యంగా కొత్త బావలతో బావమరుదులు, మరదళ్లు చేసే సందడి అంతా ఇంతా కాదు. పాత బావ షోయబ్ మాలిక్‌ తాజాగా భారతీయుల చేతుల్లో అలాగా బుక్కయిపోయాడు.

ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం భారత్,పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడం తెలిసిందే. మ్యాచ్ జరుగుతున్న సమయంలో మైదానంలోకి పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ అడుగెట్టాడు. భారత క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా  ‘షోయబ్ జీజూ(బావ) .. ఒకసారి ఇటు చూడవా’ అంటూ పెద్ద పెట్టున కేకలు వేశారు.

వారి కేకలు విన్న షోయబ్ వెనక్కి తిరిగి చూసి , భారత అభిమానులకు చేయి ఊపుతూ హాయ్ అని చెప్పాడు. అభిమానులు ‘బావా’ అంటూ కేకలు వేస్తున్నప్పుడు తీసిన వీడియోను అభిమానులు ట్విటర్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. షోయబ్‌ మాలిక్..  ప్రముఖ భారత టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జాను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై కొందరు వ్యతిరేకత వ్యక్తం చేశారు. అయితే పెళ్లి తన వ్యక్తిగత నిర్ణయమని ఆమె జవాబిచ్చారు. సానియా ప్రస్తుతం గర్భిణి.