నీఅభిమానం తగలెయ్య..ఆమె తప్పుజేస్తే నువ్వు సచ్చుడేంది! - MicTv.in - Telugu News
mictv telugu

నీఅభిమానం తగలెయ్య..ఆమె తప్పుజేస్తే నువ్వు సచ్చుడేంది!

January 31, 2018

పదిరోజుల క్రితం సోషల్‌మీడియాలో, యూట్యూబ్‌లో, మీడియాలోఎక్కడ చూసినా ట్రెండింగ్‌లో ఉన్న ఇద్దరు  పోలీసు అధికారుల గురించి మీకు  తెలిసే ఉంటుంది. వాళ్లే..ఏఎస్పీ సునీతారెడ్డి, కల్వకుర్తి సీఐ మల్లికార్జునరెడ్డి.  సునీతారెడ్డితో వివాహేతర సంబంధం పెట్టుకుని మల్లికార్జున రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికి.. ఆడవాళ్లతో చెప్పుదెబ్బలు కూడా తిన్నాడు. అంతేకాదు ఉన్నతాధికారులు ఈ ఇద్దరు పోలీసులను సస్పెండ్ కూడా చేశారు.

అయితే వీళ్ల ఉదంతంలో మరో ఊహించని వ్యవహారం చోటు చేసుకుంది. సునీతారెడ్డికి వీరాభిమాని అయిన వినయ్ అనే వ్యక్తి ఎంటర్ అయ్యాడు ఓ సూసైడ్ నోట్‌ను కూడా రాశాడు. అందులో ‘నేను సునీతారెడ్డిని నా జీవితంతో రోల్ మోడల్‌గా పెట్టుకున్నాను. ఆమెను ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఎదగాలనుకున్నాను.

కానీ ఆమె ప్రవర్తనతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాను, నాకు ఆత్మహత్యే గతే. నాలాంటి వాళ్లెందరికో ఆదర్శంగా ఉండాల్సిన ఉన్నత వ్యక్తులు..తమ జీవితంలో నైతిక విలువలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని ఆ సూసైడ్ నోట్‌లో రాశాడు. ఈ సూసైడ్ నోట్ పోలీసులకు చేరడంతో ప్రస్తుతం పోలీసులు వినయ్‌ని అదుపులోకి తీసుకుని  కౌన్సెలింగ్ ఇస్తున్నారు. నీ అభిమానం సల్లగుండా ఆమె తప్పు చేస్తే నువ్వు చనిపోవడం ఏంది అని పోలీసులు వినయ్‌కి సర్ధి చెబుతున్నారు.