పాపాలు చేస్తే కేన్సర్ వస్తుంది : అస్సాం ఆరోగ్యమంత్రి - MicTv.in - Telugu News
mictv telugu

పాపాలు చేస్తే కేన్సర్ వస్తుంది : అస్సాం ఆరోగ్యమంత్రి

November 23, 2017

సిగరెట్, గుట్కా తింటేనో లేదా ఇంకేదైనా ఆరోగ్య సమస్య కారణంగా కేన్సర్ వస్తుందనే విషయం మనందరికీ తెలుసు కానీ అస్సాం ఆరోగ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కేన్సర్‌కు కొత్త కారణాన్ని కనిపెట్టారు. మనుషులు చేసే పాపాల వల్ల కేన్సర్ వస్తుందట.  పాఠశాలలకు  డుమ్మా కొట్టే ఉపాధ్యాయులను ఉద్యేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘బాధ్యత‌ల నుంచి త‌ప్పించుకోవ‌డం పెద్ద పాపం. అలాంటి వారిని దేవుడు త‌ప్పకుండా శిక్షిస్తాడు. పాపాలు చేయ‌డం వ‌ల్ల కేన్సర్ రావ‌డం, యాక్సిడెంట్‌ల‌లో చ‌నిపోవ‌డం జ‌రుగుతాయి’ అని శ‌ర్మ ఉపాధ్యాయులను ఉద్దేశించి  అన్నారు. అయితే సాక్ష్యాత్తు ఆరోగ్య మంత్రి అయి ఉండి.. ఇలా పాపాలకు కేన్సర్ వస్తుందని చెప్పడం ఏంటని విపక్షాలు ఆయనపై మండిపడుతున్నాయి. అంతేకాదు ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల కేన్సర్ పేషేంట్లు  మరింత కృంగిపోతారని  ప్రతిపక్షాలు ఆయన్ను విమర్శించాయి.