కబ్జా ఇళ్లపై ఏనుగుల దాడి! - MicTv.in - Telugu News
mictv telugu

కబ్జా ఇళ్లపై ఏనుగుల దాడి!

November 29, 2017

అస్సాంలోని  రక్షిత అటవీ ప్రాతంలో నివసించే వందలాది మందిని ఏనుగుల సాయంలో పోలీసులు ఖాళీ చేయించారు. గువాహటి సమీపంలోని అమ్‌చాంగ్ అభయారణ్యంలో పలువురు అటవీ భూమిని కబ్జా చేసి ఇళ్లు నిర్మించుకున్నారు.  

వారిని  వెంటనే ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.  దాంతో పోలీసులు,అధికారులు..  ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలని ప్రజలను ఆదేశించారు. అయితే జనం ఖాళీ చేయలేదు.

 

వారిని ఖాళీ చేయించేందుకు అధికారులు, పోలీసులు 15 ఏనుగులను, బుల్ డోజర్లను రంగంలోకి దింపారు. ఏనుగులు , బుల్ డోజర్ల సాయంతో 408 ఇళ్లను కూల్చివేశారు. కూల్చివేతకు నిరసనగా  స్థానిక ప్రజలు నిరసన తెలుపుతూ పోలీసులపైకి రాళ్లు విసిరారు. పోలీసులు వారిని కంట్రోల్ చేయడానికి బాష్పవాయువును ప్రయోగించారు.

ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. జనం బుల్డోజర్లకు అడ్డమొస్తే ఏమీ చెయ్యలేం కనుక ఏనుగులను తీసుకెళ్లామని, వాటిని ఎవరూ అడ్డుకోలేరని అధికారులు చెప్పారు. పైగా ఏనుగులు  తిరగాల్సిన భూముల్లో కట్టిన ఇళ్లను వాటితోనే నేలమట్టం చేయిస్తే కబ్జాదారులకు గుణపాఠంగా ఉంటుందని అన్నారు.