అస్సాం రాజధాని దిస్పూర్లో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులే దొంగలుగా మారి సీజ్ చేసిన బంగారం ఎత్తుకెళ్లారని స్మగ్లర్లు కోర్టును ఆశ్రయించారు. తమ వద్ద నుంచి సీజ్ చేసిన 3కోట్ల రూపాయలు విలువచేసిన 60 బంగారం బిస్కెట్లను పోలీసులే ఎత్తుకెళ్లారని స్మగ్లర్లు కోర్టును ఆశ్రయించడం దిస్పూర్ నగరంలో వెలుగుచూసింది.
ముగ్గురు పోలీసు అధికారులు తమ నుంచి స్వాధీనం చేసుకున్న 60 బంగారు బిస్కెట్లను దొంగతనం చేశారని స్మగ్లర్లు కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసుల వాదన వేరేలా ఉంది. తాము స్మగ్లర్ల వద్ద నుంచి జనవరి 15వ తేదీన 60 బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నామని, కానీ స్మగ్లర్లే వాటిని తీసుకుని పారిపోయారని పోలీసులు అంటున్నారు. మొత్తం మీద 3 కోట్ల రూపాయల విలువగల బంగారం ఏమైందనేది చర్చనీయాంశంగా మారింది.Telugu News Assam Two cops flee with 60 seized gold biscuits worth Rs 3 crore