గర్భిణి ఏనుగు సహా ఐదు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

గర్భిణి ఏనుగు సహా ఐదు మృతి

December 11, 2017

మనుషుల జనాభా పెరుగుదల అడవి జంతువుల ప్రాణాల మీదకు వస్తున్నది. దీంతో పాపం వన్యప్రాణులకు ఆవాసంతో పాటు ఆహారం కూడా లభించని పరిస్థితి వచ్చింది.  అడవుల్లో ఆహారం లభించక ఊర్లపైన పడుతున్నారు. అడవి నుంచి తిండి కోసం బయటికి వచ్చిన ఏనుగులు పట్టాలు దాడుతుండగా ,  వేగంగా వస్తున్న రైలు ఢీ కొట్టడంతో ఐదు మృత్యువాత పడ్డాయి.

అస్సాం రాష్ట్రంలోని పునిత్ పూర్ జిల్లాలో  ఈ ఘటన జరిగింది. సోనిత్ పూర్ జిల్లాలోని నమేరి జాతీయ వనానికి చెందిన ఐదు ఏనుగులు ఆహారం కోసం  అడవి నుంచి బయటకు వచ్చే ప్రయత్నంలో పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది.  బంగాన్ టీ ఎస్టేట్ వద్ద గౌహతి – లాగూన్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్  వేగంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో గర్బంతో ఉన్న ఏనుగుతో పాటుగా మరో నాలుగు ఏనుగులు అక్కడిక్కడే మృతి చెందాయి. రైలు ఢీకొని మరణించిన ఏనుగుల్లో నాలుగు ఆడ ఏనుగులు ఉన్నాయి. అందులో ఓ ఏనుగు గర్బంతో ఉందని అధికారులు గుర్తించారు. తల్లి ఏనుగు కడుపులో నుంచి పిల్ల ఏనుగు మృతదేహం బయటకు వచ్చింది. ఏనుగులను అటవీ అధికారులు పోస్టుమార్టం చేసి, పూడ్చి పెట్టారు.