ముఖ్యమంత్రిగా మహేష్ బాబు - MicTv.in - Telugu News
mictv telugu

ముఖ్యమంత్రిగా మహేష్ బాబు

August 28, 2017

‘శ్రీమంతుడు’ మూవీ తరువాత మరోసారి డైరెక్టర్ కొరటాల శివ, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా ‘భరత్ అను నేను’. ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నరట. అందుకోసం అన్నపూర్ణ స్టూడియోలో 2 కోట్లతో భారీ అసెంబ్లీ సెట్ ను సిద్ధం చేశారు. ప్రస్తుతం మహేష్ ‘స్పైడర్ ‘మూవీ షూటింగ్ ఓ సాంగ్ రుమేనియాలో జరుగుతోంది.

స్పైడర్ షూటింగ్ ముగియగానే అసెంబ్లీ సెట్ లో జరిగే షూటింగ్ లో పాల్గొననున్నాడు . భరత్ అను నేను లో మహేష్  సరసన బాలీవుడ్ బ్యూటి కైరా ఆద్వానీ కథానాయకగా నటించనుంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. శ్రీమంతుడు ఘనవిజయం సాధించడంతో.. భరత్ అను నేను మూవీపై భారీ అంచనాలు పెరిగాయి.