భూమికి ప్రమాదం తప్పింది… - MicTv.in - Telugu News
mictv telugu

భూమికి ప్రమాదం తప్పింది…

September 4, 2017

భూమికి పెను ప్రమాదం తప్పింది. అంతరిక్షంలో భూ కక్ష్యకు చేరువలో ఉండే ఫ్లోరెన్స్ అనే ఉల్క భూమికి అతి దగ్గరగా వచ్చింది. ఫ్లోరెన్స్ తో పాటు దాని కక్ష్యలో ఉండే మరో రెండు చంద్రుని లాంటి గ్రహాలు  కూడా భూమికి దగ్గరగా వచ్చినట్టు నాసా తెలిపింది.భూమికి 4.4 మిలియన్ మైళ్ల దూరంలో నుంచి ఫ్లోరెన్స్  ఉల్క వెళ్లిందని పేర్కొన్నారు. ఈ ఉల్క 1890 నుంచి భూమికి దగ్గరగా వస్తోందని నాసా తెలిపింది.  శనివారం ఇది భూమికి చేరువుగా వచ్చిందని వెల్లడించింది. ఈ ఉల్క దాదాపుగా 30 ఈజిప్టు పిరమిడ్ల సైజుకు సమానంగా ఉంటుదని పేర్కొంది. ఈ ఉల్కను 1981లో శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రముఖ నర్సు ఫ్లోరెన్స్ నైటింగల్ పేరు మీదగా ఫ్లోరెన్స్ ఆస్టరాయిడ్ అని పేరు పెట్టారు.  ప్లోరెన్స్ ఉల్కపై ప్యూర్టోరికోలో గల అరేకిబో అబ్జర్వేటరీకి చెందిన శాస్త్రవేత్తలు ఆధ్యయనం చేస్తున్నారు.  2017 లో భూమికి దగ్గరగా వచ్చిన ఈ ఉల్క తిరిగి 2,500 సంవత్సరంలో భూమికి దగ్గరగా వస్తుందట.  ప్రతి 2 వేల సంవత్సరాలకు ఒక్కసారి అంతరిక్షంలో పుట్ బాల్ మైదానం అంత వెడల్పు  గల ఓ ఉల్క భూమిని ఢీ కొడుడుందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.