సన్యాసం పుచ్చుకుంటారా..  అయితే ఇది మీకే..! - MicTv.in - Telugu News
mictv telugu

సన్యాసం పుచ్చుకుంటారా..  అయితే ఇది మీకే..!

January 30, 2018

ఆస్ట్రియాలోని  స్పాల్ఫెల్డెన్ కొండల్లో ప్రాంతంలో ఒక అందమైన పురాతన ఆశ్రమం ఉంది. దాన్ని 350 ఏళ్ల క్రితం నిర్మించారు. అప్పటి నుంచి ఈ  ఆశ్రమంలో సన్యాసులు నివాసం ఉండేవారు. కాలక్రమేణా ఈ ఆశ్రమంలో ఉండే సన్యాసుల సంఖ్య తగ్గిపోయింది.మధ్యయూరప్‌లో అతి అరుదైన ఆశ్రమం ఇది.  దీనిని పరిరక్షించాలని స్థానిక ప్రభుత్వం  సంకల్పించింది. దాంతో ఆశ్రమ నిర్వహణ బాధ్యత ఎవరికైనా అప్పగించాలని భావించింది. సన్యాసిగా ఒంటరి జీవితం గడపాలని కోరుకునేవారు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. దరఖాస్తు  చేసుకునేవారికి క్రిస్టియిన్ మతంపై నమ్మకం ఉండాలన్న నిబంధన ప్రభుత్వం విధించింది. ఎంపికైన వ్యక్తి ఆశ్రమంలో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఈ ఆశ్రమంలో ఉంటే చాలు. ఆశ్రమాన్ని సందర్శించడానికే వచ్చే పర్యాటకులతో ప్రార్థనలు చేయించాల్సి ఉంటుంది.