స్మార్ట్‌ఫోన్‌పై 5 వేల డిస్కౌంట్.. కంపెనీ ఏదంటే... - MicTv.in - Telugu News
mictv telugu

స్మార్ట్‌ఫోన్‌పై 5 వేల డిస్కౌంట్.. కంపెనీ ఏదంటే…

October 23, 2018

స్మార్ట్ ఫోన్లపై రూ.5000 వరకు డిస్కౌంట్ వుంటే కష్టమర్లు ఊరుకుంటారా? ఎగిరెగిరి అందుకోరూ. ఇంతకీ ఆ స్మార్ట్ ఫోన్లు ఏవంటే.. ఆసుస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1, ఆసుస్ జెన్ఫోన్ 5జెడ్, ఆసుస్ జెన్ఫోన్ మ్యాక్స్ ఎం1, ఆసుస్ జెన్ఫోన్ లైట్ ఎల్1 స్మార్ట్ఫోన్లు. ఈ పేర్లు వినగానే ఇవి తైవాన్‌కు చెందిన ఫోన్లు అని అర్థం అయిపోయింది కదూ.  కష్టమర్లను ఆకట్టుకోవడానికి వివిధ కంపెనీలు రకరకాల జిమ్మిక్కులు వేస్తుంటాయి. ఇది కూడా అలాంటిదే. ఈ క్రమంలో ఆసుస్ ఈ ఆఫర్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రకటించింది.

అక్టోబర్ 24 నుంచి ఆసుస్ ఫోన్ల అమ్మకాలు ప్రారంభమవుతాయని, అక్టోబర్ 27 వరకు ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్ ఉంటుందని కంపెనీ తెలిపింది. 4జీబీ ర్యామ్, 6జీబీ ర్యామ్ వేరియంట్ ఆసుస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1 స్మార్ట్ఫోన్ ప్రారంభ ధర రూ. 12,999 నుంచి రూ. 14,999తో మొదలవుతుందని కంపెనీ పేర్కొంది. 3జీబీ ర్యామ్ ఆసుస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1 ఫోన్ రూ. 9,999 లభిస్తోందని కంపెనీ తెలిపింది.

కష్టమర్లను ఆకర్షించడానికి ఆసుస్ మరో ఆఫర్ కూడా ఇచ్చింది. యాక్సిస్ బ్యాంకు కార్డు ద్వారా ఆసుస్ ఫోన్లను కొనుగోలు చేసిన వినియోగదారులకు అదనంగా 10 శాతం డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ పేర్కొంది. అన్నీ వేరియంట్ల ఫోన్లపై ఈఎంఐ ఛార్జీలు ఉండవని సంస్థ స్పష్టం చేసింది.