ఊరిస్తున్న రంగస్థలం రెస్టారెంట్ - MicTv.in - Telugu News
mictv telugu

ఊరిస్తున్న రంగస్థలం రెస్టారెంట్

March 29, 2018

‘ రంగస్థలం ’ సినిమా విడుదలకు ముందే బోలెడంత పబ్లిసిటీని కైవసం చేసుకుంటోంది. తాజాగా రంగస్థలం పేరిట హైదరాబాద్ కొంపల్లిలో ఓ రెస్టారెంట్ వెలిసింది. చాలా మందిని ఈ రెస్టారెంట్ ఆకర్షిస్తోంది. తద్వారా హోటల్ యాజమాన్యం హాయిగా క్యాష్ చేసుకుంటున్నారు. రెస్టారెంట్‌కు రంగస్థలం పేరు పెట్టినప్పటి నుంచి గిరాకీ బాగా పెరిగిందంటున్నారు రెస్టారెంట్ నిర్వాహకులు.ఆ మ‌ధ్య బాహుబ‌లి చిత్రంలోని పాత్ర‌ల పేరుతో మెనూనే రెడీ చేసి జ‌నాల దృష్టిని ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేశారు హోట‌ల్ నిర్వాహ‌కులు. సినిమాకి సంబంధించి విడుద‌లైన పాట‌లు, టీజ‌ర్స్‌, ట్రైల‌ర్ అభిమానుల‌లో అంచ‌నాలు పెంచాయి. మార్చి 30న విడుదల కానున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్, సమంత జంటగా నటించిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు.