ఆస్ట్రేలియాలో ఇద్దరు ఆడోళ్ల పెళ్లి - MicTv.in - Telugu News
mictv telugu

ఆస్ట్రేలియాలో ఇద్దరు ఆడోళ్ల పెళ్లి

December 17, 2017

ఆస్ట్రేలియాలో తొలి లెస్భియన్ మ్యారేజ్ జరిగింది.  ఇద్దరు ఆడవాళ్లు ఒకరినొకరు ఇష్టపడి బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. స్వలింగ వివాహాలకు సంబంధించిన బిల్లును ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటీవలే ఆమోదించింది. దీనితో లారెన్ ప్రైస్, అమీ లేకర్ అనే అమ్మాయిలు బంధువులందరిని, స్నేహితులను పిలిచి ఒక్కటయ్యారు.

ఆస్ట్రేలియాలో పెళ్లి చేసుకున్న  తొలి లెస్భియన్ జంట కూడా వీరిదే. ఇదొక్కటే కాదు ఇంకా చాలా దేశాల్లో ఇలా స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లు చాలానే జరిగాయి. ఇద్దరు గేలు కూడా చాలా మంది ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ప్రకృతి విరుద్దంగా ఇలాంటి పెళ్లిళ్ల గురించి వాళ్లను అడిగితే …ఎవరేం అనుకుంటే మాకేంటి నచ్చిన వాళ్లతో జీవితాన్ని పంచుకోవడమే జీవితంలో నిజమైన ఆనందం. ఇష్టపడిన వాళ్లు ఆడోళ్లు అయితేంటి మగవాళ్లు అయితేంటి అని అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాలు స్వలింగ వివాహాలకు చట్టబద్దం చేసింది.