ఇండియాలో ఆసీస్ పర్యటన ఖరారు.. టీ-20, వన్డే సిరీస్

ఆస్ట్రేలియా సొంత గడ్డపై ఇటీవల ముగిసిన టెస్ట్ సిరీస్‌లో టీంఇండియా చారిత్రక విజయం సాధించన సంగతి తెలిసిందే. అయితే వచ్చే నెలలో భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటించనున్నది. దానికి సంబందించిన షెడ్యూల్ ఖరారైనది. భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటన షెడ్యూల్‌ను బీసీసీఐ ఖరారు చేసింది. ఈ పర్యటనలో భారత్‌తో ఆసీస్ టీ-20, వన్డే సిరీస్ ఆడనుంది. ఫిబ్రవరి 24 నుండి మార్చి 13 వరకు భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటిస్తుంది. ఫిబ్రవరి 24న మొదటి టీ-20తో ఈ పర్యటన మొదలవుతుంది. ఈ పర్యటనలో ఇరు జట్లు రెండు టీ-20లు, ఐదు వన్డేలు ఆడనున్నాయి. ఫిబ్రవరి 27న రెండవ టీ-20 విశాఖలో, మార్చి 2న హైదరాబాద్‌లో మొదటి వన్డే జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం టీ20 మ్యాచ్‌లు రాత్రి 7 గంటలకు, వన్డే మ్యాచ్‌లు మధ్నాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతాయి.Telugu News Australia's limited-overs tour of India to start on February 24

షెడ్యూల్:

* ఫిబ్రవరి 24 – మొదటి టీ20 – బెంగళూరు

* ఫిబ్రవరి 27 – రెండవ టీ20 – విశాఖ

* మార్చి 2 – మొదటి వన్డే – హైదరాబాద్   

* మార్చి 5 – రెండవ వన్డే – నాగపూర్

* మార్చి 8 – మూడవ వన్డే – రాంచి

* మార్చి 10 – నాలుగవ వన్డే – మొహాలీ

* మార్చి 13 – ఐదవ వన్డే – ఢిల్లీ