భద్రాద్రి కొత్తగూడెంలో నిరుద్యోగులకు ఆటోల పంపిణీ... - MicTv.in - Telugu News
mictv telugu

భద్రాద్రి కొత్తగూడెంలో నిరుద్యోగులకు ఆటోల పంపిణీ…

December 18, 2017

భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో నిరుద్యోగ యువతకు ఎమ్మెల్యే జలగం రావ్ ఆటోలను పంపిణీ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం స్వయం ఉపాధి క్రింద ఈ ఆటోలను మంజూరు చేసింది. తెలంగాణ ఆటో యూనియన్స్  ఆధ్వర్యంలో ఎమ్మెల్యే యువతకు ఈఆటోలను అందించారు.

ఆటోలు పంపిణీ చేయడంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఉద్యోగం రాలేదంటూ ఊరికే కూర్చుండకుండా, ఏదో ఒక పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలవాలని యువతకు ఈకార్యక్రమం ద్వారా పలువురు సందేశమిచ్చారు.