తెలంగాణ లీగ్ అంబాసిడర్‌గా అజార్  - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ లీగ్ అంబాసిడర్‌గా అజార్ 

October 27, 2017

త్వరలో ప్రరంభం కానున్న తెలంగాణ ప్రీమియర్ లీగ్‌కు ( టీపీఎల్ ) అంబాసిడర్‌గా భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఎంపికయ్యారు. టీపీఎల్‌ రెండో ఎడిషన్‌లో భాగంగా ప్రారంభం కానున్న ఈ లీగ్‌లో 12 జట్లు పాల్గొంటున్నాయి. అత్యంత అట్టహాసంగా నిర్వహిస్తున్న ఈ టీపీఎల్ ప్రత్యక్ష ప్రసారాలు ప్రముఖ ఛానళ్ళలో రానున్నాయని టీపీఎల్‌ సీఎండీ మన్నె గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. ఈ లీగ్‌కు హైదరాబాదీ అయిన అజారుద్దీన్ అంబాసిడర్‌గా ఎన్నికవడం చాలా గర్వకారణమన్నారు.