బాబుకు పునర్జన్మ.. ఈ పోలీసులకు సలాం.. - MicTv.in - Telugu News
mictv telugu

బాబుకు పునర్జన్మ.. ఈ పోలీసులకు సలాం..

February 22, 2018

భూమ్మీద నూకలు బాకీ వుండాలి గానీ మృత్యువు ముందు కూడా మీసాలు మెలేస్తూ బతికేయొచ్చు. ఈజిప్టులో ఓ ఐదేళ్ళ బాబు మీద మృత్యువు తన పంజా విసరాలనుకొని విసుగెత్తిపోయింది. కారణం అతనికింకా బతికే యోగం వుంది కాబట్టి దాని పంజాకు చిక్కలేదు. ఈ ఘటనలో దేవుడు పంపిన దూతల్లా, బాలుడి పాలిట ప్రాణదాతల్లా మారారు ముగ్గురు పోలీసులు.  ఓ ఐదేళ్ళ బాలుడు తన ఇంటి అంతస్తు నుండి జారి పడి మూడో అంతస్తు బాల్కనీకి వేలాడుతున్నాడు.

గుక్కపట్టి ఏడుస్తున్న బాలుణ్ణి గమనించిన పోలీసులు ఎలాగైనా అతడిని కాపాడాలనుకున్నారు. గేటు మీద ఆరేసిన దుప్పటి లాగి పట్టుకున్నారు. అది చాలదన్నట్టు మరో పోలీస్ ఇంకొక దుప్పటి తెచ్చే ప్రయత్నం చేశాడు. క్షణాల వ్యవధిలోనే ఆ బాలుడు దబ్బున పడబోతుండగా ఓ పోలీసు అరచేతుల్లో పట్టుకునే ప్రయత్నం చేశాడు. బాలుడు భూమ్యాకర్షణ శక్తికి వేగంగా భూమ్మీదకు దూసుకొచ్చాడు. ఈ క్రమంలో అతను కింద పడ్డా బాలుడికి చిన్న గాయం కూడా తగలకుండా ప్రాణాలతో కాపాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.