పోలవరాన్ని ఆపేస్తాం! - MicTv.in - Telugu News
mictv telugu

పోలవరాన్ని ఆపేస్తాం!

November 30, 2017

పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశాడు. గురువారం మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో  కేంద్రంపై పలు వ్యాఖ్యలు చేశారు. పోలవరం టెండర్ల విషయంలో కేంద్రం ఆపమంటే ఆపేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. పోలవరం అనుకున్న సమయానికి పూర్తి కావాలంటే, తాము టెంటర్లను పిలిచామని…అయితే పోలవరం ప్రాజెక్ట్ కు పిలిచిన టెండర్లను ఆపాలని కేంద్రం ఉన్నతాధికారి లేఖ రాశారని, దీనితో పోలవరం ప్రాజెక్ట్ పై మరింత జాప్యం అవుతోందని  బాబు అన్నారు.కేంద్రం అదే వైఖరితో ఉంటే పోలవరం ప్రాజెక్ట్‌ను కేంద్రానికే అప్పజెప్పుతామని బాబు అన్నారు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. పోలవం ప్రాజెక్ట్ ను కేంద్రం పూర్తి చేస్తానంటే, బాబు ఎందుకు ఒప్పుకోలేదని ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.