పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు కూడా తిట్టేశాడు... - MicTv.in - Telugu News
mictv telugu

పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు కూడా తిట్టేశాడు…

December 11, 2017

ఇటీవలే పోలవరం ప్రాజెక్టును సందర్శించి ‘ఒక సెక్రరేటియట్ కట్టడంలో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం.. పోలవరం లాంటి భారీ ప్రాజెక్టుని ఏడాదిలోగా ఎలా కడుతుంది?’ అని చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించిన విషయం తెలిసిందే. దీంతోపాటు బాబు పరిపాలను సుతిమెత్తగా, సుతారంగానూ విమర్శించాడు.

పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు మండిపడ్డారు. అసలు పవన్‌కు పోలవరం గురించి ఏం తెలుసు ? అవగాహన లేకుండా మాట్లాడవద్దు. అని పవన్ ని తిట్టాడు. అంతేకాదు ఈసందర్భంగా వైసీపీ నేత జగన్ పై కూడా చంద్రబాబు  మండిపడ్డాడు. అసలు జగన్ కు కాంక్రీటు , పిల్లర్ల గురించి ఏమైనా తెలుసా ? ఏమీ తెలియకుండా పోలవరంపై మాట్లాడవద్దని అది ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్టే అవుతుందని ఆయన హెచ్చరించాడు.