బాబు గోగినేని చెప్పిన జ్యోతిష్యం.. అఫ్గాన్లో భూకంపం! - MicTv.in - Telugu News
mictv telugu

బాబు గోగినేని చెప్పిన జ్యోతిష్యం.. అఫ్గాన్లో భూకంపం!

January 31, 2018

మంత్రాలంటూ, జాతకాలంటూ, అద్భుత శక్తులంటూ, వాస్తులంటూ పబ్బం గడుపుకుంటున్న వారిని ఎప్పటికప్పుడు చర్చలో పాల్గొని వారిని ఎండగడుతున్న బాబుగోగినేని గురించి అందరికీ తెలిసిందే. ఈ మధ్య జరిగిని కొన్ని టీవీ చానళ్ల చర్చలతో ఆయన పబ్లిక్‌లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఈ రోజు కూడా ఆయన గ్రహాణం దోషమా? అన్న విషయంపై  టీవీ9లో జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన..‘నాకు మంత్రాలు తెలీవు,శాస్త్రాలు అంతకన్నా తెలీవు, వాస్తులు, గీస్తులను నేను నమ్మను కానీ నేను సంపాదించిన విజ్ఞాన శాస్త్రంతో చెబుతున్నాను. ఈ రోజు నుంచి రాబోవు 45 రోజుల్లో భూమిలో కానీ, సముద్రంలో కానీ ఎక్కడో ఓ చోట భూకంపం వస్తుంది రాసి పెట్టుకోండి’ అని చర్చలో చెప్పాడు.

ఆయన అలా చెప్పాడో లేదో ఆఫ్ఘనిస్తాన్‌లో ఇవాళ భూకంపం రానే వచ్చింది. కుంజ్ స‌మీపంలో రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రత‌తో భూకంపం వ‌చ్చింది. ఆ భూకంప ప్రభావం పాకిస్థాన్‌, భార‌త్‌లోనూ క‌నిపించింది. పాకిస్థాన్‌తో పాటు ఢిల్లీ, శ్రీన‌గ‌ర్ ప్రాంతాల్లో భూ ప్రకంప‌న‌లు వచ్చాయి. శ్రీన‌గ‌ర్‌లో వచ్చిన భూకంపం కారణంగా జనాలు ఆఫీసులు, బిల్డింగ్‌ల నుంచి ప‌రుగులు తీశారు. మరి నిజంగా బాబు గోగినేని భూకంపం  45 రోజుల్లో వస్తుందని అన్నారు. ఆయన చెప్పి నాలుగు గంటలు గడవక ముందే భూకంపం వచ్చింది. మరి దీనిపై స్వామీజీలు, బాబాలు ఏమని చెబుతారో ఓ డిబేట్ పెడితే బాగుంటదని బాబుగోగినేని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.