పాప వైద్య ఖర్చులు నేనే భరిస్తా.. హరీష్ రావు - MicTv.in - Telugu News
mictv telugu

పాప వైద్య ఖర్చులు నేనే భరిస్తా.. హరీష్ రావు

February 21, 2018

దిక్కులేని వారికి దేవుడే దిక్కంటారు. వీరికి మాత్రం మంత్రి హరీష్ రావే దేవుడయ్యారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పాప వైద్యానికయ్యే ఖర్చును తానే భరిస్తానని హామీ ఇచ్చారు. మరోమారు మానవతా హృదయం వున్న నాయకుడని మంత్రి హరీష్ రావు నిరూపించారు. మెదక్ జిల్లా తూప్రాన్‌కి చెందిన గుజ్జ మహేశ్ యాదవ్ అనిత దంపతుల కూతురు నిహారిక ( 2నెలలు ).పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతోంది. ఈ విషయం బుధవారం హైదరాబాద్‌లోని మంత్రి హరీష్ రావు గారికి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, టీహెచ్ఆర్ యువసేన కో ఆర్డినేటర్ జన్ను నిశాంత్ కుమార్ తెలియజేయగానే వెంటనే స్పందించారు. పాప వైద్య ఖర్చులు తానే భరిస్తానని హామీ ఇచ్చారు. మంత్రి గారి సహృదయతకు పాప తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.