mictv telugu

మందుకొట్టి.. ప్రసవంలో బిడ్డను రెండు ముక్కలు చేశారు..

January 10, 2019

గవర్నమెంట్ హాస్పిటళ్ల వైద్యుల్లో కొందరు నరరూప రాక్షసులను తలపిస్తూ, ప్రజల ప్రాణాలను చిదిమేస్తున్నారు. పుట్టక ముందు ఒక ప్రాణం అనంతలోకాలకు చేరువయింది. ప్రభుత్వ వైద్యులు, నర్సులు పూటుగా మందుకొట్టి ఒక గర్భిణికి గర్భశోకం మిగిల్చారు. అసలు ఇక్కడ రాయడానికే పదాలు రానంత ఘోరానికి పాల్పడి పసిబిడ్డను రెండు ముక్కలు చేశారు. ఈ హృదయ విదారక ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్ పట్టణంలో చోటు చేసుకుంది.

దీక్ష కాన్వార్ అనే గర్భిణికి నొప్పులు రావడంతో రామ్‌ఘడ్ ప్రాంతంలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ సమయంలో అక్కడ డ్యూటీలో ఉన్న వైద్యులు, నర్సులు మద్యం సేవించి ఉన్నారు. ఈ విషయం గమనించని దీక్ష బంధువులు ఆమెను ఆ తాగుబోతు వైద్యుల చేతుల్లో పెట్టారు. ఆమెకు ప్రసవం సరిగ్గా చేయకుండా బిడ్డను సగం వరకు బలవంతంగా లాగారు. దీంతో బిడ్డ రెండు భాగాలైపోయింది. ఒక భాగాన్ని తీసిన తాగుబోతు మూక.. దాన్ని దాచేసింది. తర్వాత ప్రసవం మా వల్ల కాదని చేతులెత్తేసి ఆమెను జోధ్‌పూర్‌లోని వేరే ఆసుపత్రికి పంపించారు. అక్కడ ఆమె గర్భంలో మిగిలిపోయిన మృతశిశువు భాగాన్ని తొలగించారు. సర్కారీ వైద్యులు తాగి ఉన్నారని.. తమతో అసభ్యకరంగా కూడా ప్రవర్తించారని దీక్ష బంధువుుల ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యానికి పోలీస్ స్టేషన్ లో ఐపీసీ సెక్షన్ 304 ఏ క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో మృతశిశువు భాగాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Telugu News Baby split into two during delivery after nurse uses 'brute force' at Jaisalmer government hospital