విషాదం… విద్యుత్ షాక్ కొట్టి బాడ్మింటన్  క్రీడాకారుడు మృతి

పశ్చిమ బెంగాల్‌లో ఘోరం జరిగింది. వృత్తిలో ఉండగా విద్యుత్ షాక్ తగిలి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మృతిచెందాడు. రాష్ట్రానికి చెందిన రాష్ట్ర డబుల్స్ నంబర్ వన్ ర్యాంకర్ త్రినాంకుర్ నాగ్ (26) ప్రస్తుతం స్పోర్ట్ కోటాలో రైల్వే శాఖలో ఉద్యోగిగా ఉన్నాడు. షెడ్డులో పని చేస్తుండగా హై టెన్షన్ కరెంట్ తీగలు తగిలాయి. దీంతో అతనికి తీవ్ర గాయాలు కాగా, హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు.Telugu News badminton player died due to electric short circuitచిన్నతనం నుంచి బ్యాడ్మింటన్‌పై ఆసక్తి పెంచుకున్న త్రినాంకుర్, పలు టోర్నీల్లో విజేతగా నిలిచాడు. అతని మృతికి  పశ్చిమ బెంగాల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ అధికారి బిశ్వాస్‌ సంతాపాన్ని తెలిపారు. తన ప్రతిభతో రాష్ట్రానికి పలు పతకాలు తెచ్చి పెట్టిన త్రినాంకుర్ ఇక లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేకున్నామని ఆయన అన్నారు. త్రినాంకుర్ మృతితో ఓ గొప్ప క్రీడాకారుడిని కోల్పోయామని అన్నారు.