సాహో రే బాహుబలి రికార్డు.. 10 కోట్ల వ్యూస్! - MicTv.in - Telugu News
mictv telugu

సాహో రే బాహుబలి రికార్డు.. 10 కోట్ల వ్యూస్!

March 1, 2018

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించిన సంగతి తెలిసిందే. ‘బాహుబలి 2’( ది కంక్లూజన్) ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు కొల్లగొట్టి, అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా  రికార్డ్ నెలకొల్పింది.

తెలుగు సినిమా స్థాయిని  ప్రపంచానికి చాటింది. తాజాగా ఈ సినిమాలోని ఓ పాట కూడా  రికార్డు నెలకొల్పింది. ‘భళి భళి రా భళి..  సాహో రే బాహుబలి’  వీడియో పాట యూట్యూబ్‌లో 100 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ పాట తెలుగుతోపాటు దక్షిణాది భాషల్లో ఈ ఘనత సాధించిన తొలిపాటగా  నిలించింది. శివశక్తి దత్త, డాక్టర్ కె.రామకృష్ణ పాటను రాయగా..కీరవాణి అద్భుతమైన సంగీతం అందించిన ఈ పాట నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుంది.