ఏనుగెక్కిన బాహుబలి ఇక మెడలు ఎక్కుతాడు! - MicTv.in - Telugu News
mictv telugu

ఏనుగెక్కిన బాహుబలి ఇక మెడలు ఎక్కుతాడు!

December 5, 2017

సూపర్ హిట్ అయిన సినిమాల పేర్లతో దుస్తులు రావడం కొత్త విషయం కాదు. ఆ సినిమాల హీరో, హీరోయిన్ల  పేర్లతో వస్త్ర వ్యాపారులు తమ మార్కెట్ పెంచుకుంటారు. అయితే బంగారు నగల వ్యాపారలు కూడా  ఈ దారిని అనుసరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా  విజయం సాధించిన ‘బాహుబలి’ సినిమా పేరుతో బంగారు ఆభరణాలను తయారు చేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నారు. ‘బాహుబలి’ సినిమాలోని వివిధ సన్నివేశాలను ఆధారంగా బంగారు ఆభరణాలు తయారు చేశారు.

శివగామి.. మహేంద్ర బాహుబలిని చేతితో ఎత్తుకుని నీళ్లలో మునిగిపోతున్న సన్నివేశం, బాహుబలి ఏనుగును ఎక్కే సన్నివేశం, అలాగే సింహాసనంపై బాహుబలి కూర్చున్న దృశ్యాలను లాకెట్‌లుగా మార్కెట్‌లో తీసుకొస్తున్నారు.  టెంపుల్ జ్యూయలరీ అన్నది జ్యూయలరీలో ఓ డిజైనింగ్ కేటగిరీ. ఆ కేటగిరీ  విధానంలో కళాకారులు బాహుబలి డిజైన్లు రూపొందిస్తున్నారు.  ప్రస్తుతం నెట్టింట ఈ ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయి