కొత్త బజాజ్ పల్సర్ 150 వచ్చేసింది.. - MicTv.in - Telugu News
mictv telugu

కొత్త బజాజ్ పల్సర్ 150 వచ్చేసింది..

April 18, 2018

బజాజ్ మోటార్ వాహనాల సంస్థ కొత్త బైక్‌ను లాంచ్‌ చేసింది. పాత మోడల్‌ను అప్‌డేట్‌ చేసి ‘పల్సర్ 150’ పేరుతో తిరిగి మార్కెట్లో విడుదల చేసింది.  ఈ కొత్త వేరియంట్ షార్ప్‌ అండ్‌ స్పోర్టియర్ స్టైలిం‌గ్ ను అందించింది. ప్రీమియం 150 స్పోర్ట్స్ విభాగంలో ఈ బైక్‌‌ను తీసుకొచ్చారు. ప్రస్తుతం ఉన్న వేరియంట్‌కు బదులు  ట్విన్‌-డిస్క్ వేరియంట్ అందుబాటులోకి రానుంది. ఈ బైక్ ధర రూ .78,016, (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

‘పల్సర్ 150’ ఫీచర్లు…

స్ప్లిట్‌ సీట్స్‌, లాంగర్‌ వీల్స్‌, వెడల్పైన్‌ పెద్ద టైర్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ కొత్త వేరియంట్లో 149.5సీసీ  ఇంజీన్‌, 14 పిఎస్ పవర్‌, 13.4 ఎన్ఎమ్ టార్క్‌ ఇతర ఫీచర్లు. బ్లాక్ బ్లూ, బ్లాక్ రెడ్ , బ్లాక్ క్రోమ్ రంగులలో అందుబాటులో ఉంటుంది.